Thursday, 24 August 2017 | Login

బీసిసిఐ పై మండిపడ్డ శ్రీశాంత్

వాస్తవం ప్రతినిధి: తనపై జీవితకాల నిషే ధం ఎత్తివేయాలన్న కేరళ హై కోర్టు తీర్పును సవాల్ చేసేందు కు సిద్ధమైన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)పై పేసర్ శ్రీశాంత్ మండిపడ్డాడు. తాను చెప్పిందే వేదమన్నట్లుగా భావించే బీసీసీఐ.. దేవుడిని మించిందేమీ కాదు అని శ్రీశాంత్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా తనపై కక్షపూరితంగా వ్యవహరించాలనుకోవడం సరికాదంటూ బీసీసీఐని ట్విట్టర్ సాక్షిగా శ్రీశాంత్ దుయ్యబట్టాడు. బీసీసీఐ గుర్తుంచుకో.. నేనేమీ అడుక్కోవడం లేదు, ఆడేందుకు నాకున్న అవకాశాన్ని తిరిగివ్వండని అడుగుతున్నాను. ఇది నా హక్కు. మీరేమీ దేవుడి కంటే గొప్ప కాదుగా, నేను మళ్లీ తప్పకుండా క్రికెట్ ఆడుతాను అని 34ఏండ్ల శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో శ్రీశాంత్ కేరళ హైకోర్టుకెళ్లాడు. దీనిపై పూర్తిగా విచారించిన కేరళ న్యాయస్థానం శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేయాలంటూ బీసీసీఐని గత సోమవారం ఆదేశించింది. దీంతో కేరళ కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో బీసీసిఐ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు శ్రీశాంత్.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock