Thursday, 24 August 2017 | Login

జావెలిన్ త్రో లో ఫైనల్ కి చేరిన దావీందర్ సింగ్

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన జావెలిన్‌ త్రోయర్‌ మొదటి సారి ఫైనల్స్ కి అర్హత సాధించినట్లు తెలుస్తుంది. భారత్ కు చెందినా జావెలిన్ త్రోయర్ దావీందర్‌ సింగ్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించి సంచలనం సృష్టించాడు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన పోటీల్లో దావీందర్‌ సింగ్‌ జావెలిన్‌ను 83మీటర్లు విసరడంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు. భుజం గాయంతో బాధపడుతున్న దావీందర్‌ గ్రూప్‌-బి నుంచి పోటీలో పాల్గొన్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో  విసిరి విఫలమైన అతడు మూడో ప్రయత్నంలో నిర్దేశించిన 83మీటర్లను దాటడంతో ఫైనల్‌కి దూసుకెళ్లాడు. శుక్రవారం ఫైనల్‌ పోటీలు జరగనున్నాయి. గ్రూప్‌-ఎ నుంచి ఐదుగురు, గ్రూప్‌-బి నుంచి ఏడుగురు ఫైనల్‌కి అర్హత సాధించారు. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయాడు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock