Thursday, 24 August 2017 | Login

మళ్లీ ఇరకాటంలో పడ్డ శ్రీశాంత్

వాస్తవం ప్రతినిధి: ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదురుకొంటున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌ కు ఊరట లభించినట్లే లభించి మళ్లీ ఇరకాటంలో పడేసింది. మైదానంలో తిరిగి క్రికెట్‌ ఆడాలన్న అతడి ఆశయం మరింత ఆలస్యం కానుంది. ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు వూరట కల్పించిన మూడు రోజులకే మళ్లీ బీసీసీఐ మోకాలడ్డింది.

కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయాలని బీసీసీఐ న్యాయ విభాగం నిర్ణయించింది.  ఐపీఎల్‌-2013 ఫిక్సింగ్‌ కుంభకోణంలో భాగంగా క్రికెటర్‌ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు పటియాల కోర్టు, ఈ మధ్యనే కేరళ హైకోర్టు అతడిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు కొట్టివేసి,నిషేధం తొలగించాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పును అధ్యయనం చేసిన బీసీసీఐ న్యాయ విభాగం ఈ కేసును డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేయాలని నిర్ణయించింది.

 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock