Thursday, 24 August 2017 | Login

రెండవ రౌండ్ లో దూసుకెళ్లిన సైనా...ప్రీ క్వార్టర్స్ కు!

వాస్తవం ప్రతినిధి: వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో సైనా నెహ్వాల్ దూసుకెళ్లుతుంది. సైనా రెండ‌వ రౌండ్ మ్యాచ్‌లో 21-11, 21-12 స్కోర్‌తో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స‌బ్రినా జాక్వెట్‌ను ఓడించి ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్ర‌వేశించినట్లు తెలుస్తుంది.

దెబ్బకు దిగొచ్చిన నైకీ....కొత్తకిట్ల పంపిణీ

వాస్తవం ప్రతినిధి: టీమిండియా దెబ్బ‌కు నైకీ దిగొచ్చింది. ఆ సంస్థ ఇచ్చిన కిట్స్ ఏమాత్రం బాగాలేవ‌ని, క్వాలిటీ మ‌రీ నాసిర‌కంగా ఉంద‌ని, అంతేకాకుండా అదనపు కిట్లను కేటాయించాలని ప్లేయ‌ర్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

చెస్ ప్రపంచ కప్ లో ఆడనున్న ఏడుగురు భారతీయులు!

వాస్తవం ప్రతినిధి: పది రోజుల్లో ప్రారంభం కాబోయే చెస్‌ ప్రపంచకప్‌లో ఏడుగురు భారతీయులు పోటీ పడబోతుండడం విశేషం.  సెప్టెంబరు 2 నుంచి 27 వరకు జార్జియాలోని టిబిలిసిలో చెస్‌ ప్రపంచకప్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

టీ20 లలో తోలి శతకాన్ని నమోదు చేసిన అఫ్రిది

వాస్తవం ప్రతినిధి: నార్త్‌వెస్ట్‌ టీ20 బ్లాస్ట్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు సారథి షాహిద్‌ అఫ్రిది రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా హ్యాంప్‌షైర్‌-డెర్బిషైర్‌ మధ్య జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో అఫ్రిది టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసి, అత్యంత వేగంగా శతకాన్ని నమోదు చేసిన వారి జాబితాలో చేరిపోయాడు. 

కిట్లను పంపిణి చేసే స్పాన్సర్ పై కోహ్లీ సేన అసంతృప్తి!

వాస్తవం ప్రతినిధి:  ఆటకు సంబంధించిన కిట్లను పంపిణీ చేసే స్పాన్సర్‌పై కోహ్లీ సేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జట్టులోని ఆటగాళ్లు సమస్యను మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. గత పదేళ్లుగా నైక్‌ సంస్థ టీమిండియాకి కిట్లను పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock