Thursday, 24 August 2017 | Login

ఫేస్ బుక్ వేదికగా చరిత్రకు ప్రాచుర్యం

సింగపూర్ నుంచి గోల్డె న్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం నిర్వహణ

మంగిపూడి రాధిక నిర్విరామకృషి

వాస్తవం ప్రతినిధి: నేటి సామాజిక మాధ్యమాలు అయిన వాట్సాప్, ఫేస్ బుక్ లాంటివి చాలావరకు కాలక్షేపానికని కొందరు, రాజకీయాలు సినిమాలపై చర్చల కోసమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. నేటి యువతను అత్యధికంగా ప్రభావితంచేస్తున్నఈ సోషల్ నెట్ వర్కింగ్ వలన ఉపయోగాలకన్నా నష్టాలే  ఎక్కువ అయ్యాయి. మంచి కన్నా చెడే ఎక్కువ తొందరగా వ్యాపిస్తున్న ఈరోజుల్లో దేనిని నిజంగా నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాంకేతిక పరిజ్ఞానాన్నిసామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేస్తే ఎంతో మందికి విజ్ఞానదాయకంగాను స్ఫూర్తిదాయకంగానూ పరిణమిస్తాయి.

కొట్టారి కనకయ్య నాయుడు( C.K Naidu )
 
 
కొట్టారి కనకయ్య నాయుడు( C.K Naidu ) భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి "పద్మభూషణ్" అందుకున్నాడు.
నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగినది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock