Thursday, 24 August 2017 | Login

హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ 

సంస్కృతి కాలేజ్ లో వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాటల్లో ఆ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ప్రమీల వంతు వచ్చింది. ప్రమీల మైక్ అందుకుని పాడడం మొదలుపెట్టింది. " వేణుమాధవా... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ... " అంటూ. ఆ పాట ఎవరి చెవిలో చేరి గాంధర్వమైందో తెలియదు కాని అర్జున్ చెవికి మాత్రం అది గానామృతమే అయింది. అర్జున్, ప్రమీలా క్లాస్ మేట్స్. ఆ పాట పాడుతున్నంతసేపూ తన్మయత్వంతో వింటూ అయిపోగానే అందరికంటే ముందు చప్పట్లు కొట్టినవాడు అర్జున్. ఉండబట్టలేక స్టేజ్ దగ్గరకు వెళ్లి " కంగ్రాట్స్ ప్రమీలగారూ మార్వెలస్. అద్భుతంగా పాడేరు. " అని అభినందించేడు. ఆ సన్నివేశంతో ప్రమీలా, అర్జున్ ల పరిచయం పెరిగింది. ఒకరి సెల్ నెంబర్లు ఒకరు ఇఛ్చి పుచ్ఛుకోవడం జరిగింది.

 యద్భావం తద్భవతి

మా ఇంటి ప్రక్కనే గోపాలరావు ఇల్లు. గోపాలరావూ,నేనూ స్నేహితులం. స్నేహితులం అనేకంటే ఒకే ఆఫీసులో పని చేస్తున్నవాళ్ళం అనొచ్చు. గోపాలరావు రెండు పోర్షన్ ల ఇల్లు కట్టేడు. ఒకటి తను ఉండడానికీ, రెండవది అద్దెకివ్వడానికీ. కాని అద్దెకొచ్చిన వాళ్లందరిలో ఏదో లోపం వెదికి చూసి ఇల్లు అద్దెకివ్వడానికి సంకోచించేవాడు. అలా అద్దెకు వచ్చేవాళ్ళు రావడం, గోపాలరావు తటపటాయించడం జరిగేవి.

రాధకు నీవేర ప్రాణం

 

  రాధ వారం రోజులుగా చూడని క్యాలెండరు వైపు చూసింది బితుకు బితుకుగా.తన పాలిట శత్రువైన తేదీ రానే వచ్చేసింది.మార్చ్ 3.ఆయన తిరిగి వెళ్ళిపోయే రోజు.

రాధ భర్త కృష్ణమూర్తిని ప్రమోషన్ మీద బెంగుళూరు వేసేరు.రాధ పిల్లల చదువుల మూలంగా విశాఖపట్నంలోనే ఉండిపోయింది.కృష్ణమూర్తి బెంగుళూరు వెళ్లి జాయిన్ అయి 3 నెలల తర్వాత వారం రోజులు సెలవు మీద వచ్చేడు.రాధ ఇన్నాళ్ళూ భరించిన ఒంటరితనం ఈ వారం రోజుల్లో మర్చిపోయింది.గతించిన 3 నెలల్లో నెలలు తరగడం లేదని క్యాలెండర్ పేజీలు చింపేయాలనిపించిన రాధకు ఈ వారం రోజులూ టేబుల్ క్యాలెండర్లో తేదీ మార్చాలన్నదే గుర్తుకు రాలేదు.

సంక్రాంతి సరిగమలు

మాధవరావు బాస్ ఛాంబర్  డోర్ తీసి  " మే ఐ కమిన్  సర్ " అన్నాడు. " ఎస్ కమిన్ " అన్నాడు బాస్ యధాలాపంగా. మాధవరావు లోపలికి వెళ్లి " గుడ్ మోర్నింగ్   సర్ " అన్నాడు. " గుడ్ మోర్నింగ్ . చెప్పండి మిస్టర్ మాధవరావ్ ' అన్నాడు బాస్. " సార్ ... " అంటూ నసుగుతున్న మాధవరావును చూసి " ఎనీ ప్రోబ్లమ్ ? " అడిగేడు బాస్ భాస్కరరావు.  

 అత్తారింట్లో దారేదీ..

సుబ్బారావుకు పెళ్లయిన తర్వాత వఛ్చిన మొదటి పండుగ దసరా. అందుకే వాళ్ళ మామగారు మర్యాదపూర్వకంగా వఛ్చి అల్లుడిని పండుగకు రమ్మని పిలిచేరు. ముందుగా అమ్మాయిని తనతో పంపించమని అడిగేరు. అలాగేనని తన శ్రీమతి సుందరిని మామగారితో పంపించేడు సుబ్బారావు. ఆ ఆహ్వానం సందర్భంగానే అందరికంటే ముందుగా సెలవుకు దరఖాస్తు చేసి కొత్త పెళ్లి కొడుకన్న సానుభూతిపై సెలవు మంజూరు చేయించుకున్నాడు. దాని పర్యవసానమే సుబ్బారావు అత్తారింటి ప్రయాణం.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock