Thursday, 24 August 2017 | Login

 పీలా..కబ్జాల లీల    రూ.300 కోట్ల భూములు కొట్టేసేందుకు యత్నం

 ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం

  సిట్ విచారణలో వెల్లడి.. కేసు నమోదు
 వాస్తవం ప్రతినిధి: అనుకున్నట్లే అయింది. విశాఖలో వేలకోట్ల విలువైన భూములకు సంబంధించి రికార్డులు మార్చేసి  ప్రభుత్వ భూములను సైతం తమ పేరిట మార్పించుకున్న వైనం పై తీగలాగితే డొంక కదులుతోంది. అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందన్నది నెమ్మనెమ్మదిగా స్పష్టమవుతోంది. ఇది కొందరు అధికారులు, టీడీపీ పెద్దల సాయంతోనే జరిగిందన్నది అప్పట్లోనే మంత్రి అయ్యన్నపాత్రుడు బహిర్గతం చేశారు.

అంతేకాకుండా ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వద్దకు వచ్చిన ఆయన పలు డాక్యుమెంట్లు అందజేస్తూ ఇందులో టీడీపీ నాయకులదే ప్రధాన పాత్ర అనిసైతం వెల్లడించారు. ఆయన ఉద్దేశంలో టీడీపీ నాయకులు అంటే మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు అని అర్థం. గంటా అనుచరుడైన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ సైతం ఈ కుంభకోణంలో ఉన్నట్లు సిట్ పూర్తి ఆధారాలు సేకరించింది. అంటే ఈ కేసులో గంటా సపోర్టు లేకుండా వందల కోట్ల విలువైన భూములను కొట్టేయడం సాధ్యం కాదన్న విషయం స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, అతని తోడల్లుడు పరుచూరి భాస్కరరావు తదితరుల పేర్లు ఉండనే ఉన్నాయి. కానీ వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నది సుస్పష్టం. అందుకే ఇప్పుడు రెండు కేడర్ నాయకుల పేర్లను అయ్యన్న సిట్ కు అందించి వారిపై చర్యలు తీసుకునే సత్తా చంద్రబాబుకు ఉందో లేదోనన్నది టెస్టు చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండంలోని రామవరంలో దాదాపు 95 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి పీలా గోవింద్ సదరు రికార్డులను ట్యాంపరింగ్ చేయించి తన వాళ్ల పేర్లు అందులోకి ఎక్కించారన్నది ప్రధాన ఆరోపణ. ఇదే తరహా కేసు కాకపోయినా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా ప్రభుత్వ భూములను ప్రైవేటువిగా చూపించి కోట్లాదిరూపాయలను ప్రభుత్వం నుంచి పరిహారంగా తీసుకున్న కేసు కూడా ఆ మధ్య వెల్లడైంది. ఇవన్నీ చూస్తుంటే అసలు టీడీపీ నాయకులు ప్రజలు, ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టేసి కేవలం భూములు, వాటి ఆనుపానులు పాత రికార్డులు తిరగేసే పనుల్లో బిజీగా ఉన్నారన్నది స్పష్టమవుతోంది. అంతేకాకుండా టీడీపీ నాయకుల్లోని అంతర్గత పోరు కారణంగా నాయకులు ఎవరు ఎలాంటివారన్నది స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు బురదచల్లుకుంటూ వారిలోని అరాచకత్వాన్ని సమాజానికి చూపిస్తున్నారు. గంటా వచ్చాక విశాఖ మొత్తం అవినీతిమయమైపోయింది. ఒక్క రైల్వే స్టేషను, పోర్టు స్టీలు ప్లాంటు గేటు లోపన ఉన్న ఆస్తులు మినహా మిగతా ప్రభుత్వ భూములు స్థలాలూ, పొలాలన్నీ తన వారికి కట్టబెడుతున్నారన్నది పలుమార్లు రుజువైంది. అంతేకాకుండా మంత్రి అయ్యన్న సైతం ఈ విషయాన్ని బహిర్గతపరిచారు. ఇక పీలా గోవింద్ భూ కుంభకోణంపై గతంలోనూ రాజకీయాలు.కామ్ పలు కథనాలు వెలువరించింది. అయితే తాజాగా ఆయనపై ఏకంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో అవన్నీ నూటికి నూరుశాతం నిజమేనన్న విషయం జనాలకు తెలుస్తోంది. అవినీతిని, అక్రమాలను ఖండఖండాలుగా నరికిపోగులు పెడతానని పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పీలా గోవింద్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఈ విశాఖ భూ కుంభకోణమంగా గంటా, లోకేష్ కలిసే చేస్తున్నారని, దీంతో ఈ కేసును ముందుకు తీసుకెళ్తే ఎక్కడ తన కుమారుడి పేరు బయట పడుతుందోనన్న     చంద్రబాబు కూడా గంటాను ఏమీ అనలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. మొత్తానికి దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నాయకుల తీరు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు.  

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock