Thursday, 24 August 2017 | Login

‘ఫిరాయింపు’ మంత్రులకు నోటీసులు 


వాస్తవం ప్రతినిధి:  రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం పోలేదంటే ఇదే మరి. పార్టీ మారి, పదవులు చేపట్టినా కోర్టులు మాత్రం వదలడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నలుగురికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఈ మేరకు ఎన్‌. అమర్‌ నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆది నారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఈ నలుగురికీ మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, మంత్రులుగా ఏ అర్హతతో కొనసాగుతున్నారో వారిని వివరణ కోరాలంటూ హైదరాబాద్‌కు చెందిన పాత్రికే యుడు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి వేర్వేరుగా నాలుగు కో వారెంట్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది ఆనంద్‌కుమార్‌ కపూర్‌ వాదనలు వినిపించారు. టీడీపీలో చేరిన అఖిల ప్రియ, సుజయ కృష్ణా, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసా గడానికి వీల్లేదన్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock