Thursday, 24 August 2017 | Login

మత్తుమందులో సినీ ప్రముఖులు

పరిశ్రమను కుదిపేస్తున్న కేసులు

వాస్తవం ప్రతినిధి: సినిమా పరిశ్రమలోని అవలక్షణాలు లోపాలు గతంలో పలుమార్లు బహిర్గతమైనా అవన్నీ మామూలేలే అనుకుంటూ జనం కూడా మిన్నకున్నారు. అయితే ఇప్పుడు వారిలోని విషసంస్కృతి మొత్తం సమాజాన్నే చెడుదారిపట్టించేలా మారడంతో ప్రభుత్వాలు కొరడా ఝళిపించాయి. తీగ  లాగే కొద్దీ డొంక కదులుతోంది. రవితేజ, తనీష్, తరుణ్, నందు, చార్మీ, పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్ తదితరులు పోలీసుల నుంచి నోటీసులు అందుకోగా మరికొందరు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.

కేసు విచారణకు అకున్సభర్వాల్నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది. అసలు కేసు బయటకు రాగానే ఆయన సెలవుపై వెళ్లనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో కేసు నుంచి పెద్దలను తప్పించేందుకు ఆయన్ను సెలవుపై పంపుతున్నారని విమర్శలు రావడంతో సభర్వాల్ తన సెలవును కేన్సిల్ చేసుకున్నారు. దీంతో ప్రధాన డ్రగ్ సరఫరాదారైన కెల్విన్ను అకున్ నేరుగా విచారించి వాస్తవాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం, మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఆరుగురి పేర్లూ సినీ పరిశ్రమనే బెంబేలెత్తిస్తాయని అంటున్నారు. టాలీవుడ్కే మూల స్తంభాల్లాంటి ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు లిస్టులో ఉన్నారంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్మాస్టర్కూడా కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కేసులో దొరికిన నిందితుడు ఏది చెబితే దానిని నమ్మేసి హడావుడి చేసే విధానం ఎన్ఫోర్స్మెంట్, నార్కోటిక్స్విభాగాల్లో ఉండదు. పక్కా సాక్ష్యాలున్న తర్వాతే రంగంలోకి దిగుతారు. కెల్విన్కేసులోనూ ఎన్ఫోర్స్మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టంలోని సెక్షన్67ను ప్రయోగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. వ్యక్తి పక్కాగా డ్రగ్స్వాడుతున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవడానికి నోటీసులు ఇచ్చి పిలుస్తారు. విచారణలో చెప్పే అంశాలను, తమ వద్ద ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకొని పొంతన కుదురుతోందా? లేదా అన్నది పరిశీలిస్తారు. తర్వాతే అసలు సినిమా ఉంటుంది. అయితే తాను విషయాలపై స్పందించేందుకు తీరికలేదని, ప్రస్తుతం బాలయ్యతో తీస్తున్న పైసావసూల్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నానని పూరీ జగన్నాథ్ ప్రకటించారు. పూరీ ఇప్పటికే పోలీసులతో టచ్ లో ఉంటూ పలువురి పేర్లు వెల్లడించేశాడంటూ పుకార్లు వచ్చాయి. అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి పేర్లూ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా తమ వాళ్లను కాపాడుకునేందుకు సినిమా పెద్దలు రాజకీయ నాయకుల సాయం కోరుతున్నారు. కేసు ఎటు తిరుగుతుందో తెలియడానికి మరింత టైం పట్టేలా ఉంది. మరింత లోతుగా దర్యాప్తు సాగితేతప్ప అసలు నిందితులు, దోషులు, బాధితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం లేదు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock