Thursday, 24 August 2017 | Login

ఆత్మీయతకు ఆలంబనకు రక్షా బంధన్

వాస్తవం ప్రతినిధి: అమ్మలో సగం.. నాన్నలో సగం.. ఈ రెండూ కలిస్తేనే అన్న.. అవును ఓ ఆడపిల్లకు అన్న కానీ, తమ్ముడు కానీ ఉంటే కలిగే ఆనందమే వేరు. చిన్నప్పుడు సరదాగా ఆటపట్టించినా, తగాదాలు పడినా, వాదించుకున్నా పెద్దయ్యాక మాత్రం వారిలోని అనుబంధం మరింతగా పెనవేసుకుంటుంది.

కాపులను ముంచేశార్రా దేవుడోయ్

 కాపు కార్పొరేషన్లో అవినీతి రాజ్యం

 నిధులన్నీ చైర్మన్, బంధువులకే భోజ్యం

వాస్తవం ప్రతినిధి:  అసలు అవినీతన్నది లేకుండా ఏ పథకమూ అమలు చేసేందుకు రూల్స్ ఒప్పుకోవన్నట్లుగా ఉంది టీడీపీ పాలన. అది కాసింత అతిశయోక్తే అయినప్పటికీ వాస్తవాలు అలాగే ఉన్నాయి. ఏదైనా పథకంలో పదిపైసలవంతో పావలావంతో అవినీతో ఇంకేదో జరుగుతుంది. కానీ చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ పథకంలోనూ పది శాతానికి మించి నిజాయితీ లేదని మిగతా 90 శాతమూ అవినీతేనని, కార్యకర్తలు, నాయకుల చేతుల్లోకే వెళుతోందన్నది పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

‘ఫిరాయింపు’ మంత్రులకు నోటీసులు 


వాస్తవం ప్రతినిధి:  రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం పోలేదంటే ఇదే మరి. పార్టీ మారి, పదవులు చేపట్టినా కోర్టులు మాత్రం వదలడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నలుగురికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

 పీలా..కబ్జాల లీల    రూ.300 కోట్ల భూములు కొట్టేసేందుకు యత్నం

 ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం

  సిట్ విచారణలో వెల్లడి.. కేసు నమోదు
 వాస్తవం ప్రతినిధి: అనుకున్నట్లే అయింది. విశాఖలో వేలకోట్ల విలువైన భూములకు సంబంధించి రికార్డులు మార్చేసి  ప్రభుత్వ భూములను సైతం తమ పేరిట మార్పించుకున్న వైనం పై తీగలాగితే డొంక కదులుతోంది. అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందన్నది నెమ్మనెమ్మదిగా స్పష్టమవుతోంది. ఇది కొందరు అధికారులు, టీడీపీ పెద్దల సాయంతోనే జరిగిందన్నది అప్పట్లోనే మంత్రి అయ్యన్నపాత్రుడు బహిర్గతం చేశారు.

మత్తుమందులో సినీ ప్రముఖులు

పరిశ్రమను కుదిపేస్తున్న కేసులు

వాస్తవం ప్రతినిధి: సినిమా పరిశ్రమలోని అవలక్షణాలు లోపాలు గతంలో పలుమార్లు బహిర్గతమైనా అవన్నీ మామూలేలే అనుకుంటూ జనం కూడా మిన్నకున్నారు. అయితే ఇప్పుడు వారిలోని విషసంస్కృతి మొత్తం సమాజాన్నే చెడుదారిపట్టించేలా మారడంతో ప్రభుత్వాలు కొరడా ఝళిపించాయి. తీగ  లాగే కొద్దీ డొంక కదులుతోంది. రవితేజ, తనీష్, తరుణ్, నందు, చార్మీ, పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్ తదితరులు పోలీసుల నుంచి నోటీసులు అందుకోగా మరికొందరు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock