Monday, 21 August 2017 | Login

టాక్స్ తప్పించుకోవడానికి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన డ్రైవర్

వాస్తవం ప్రతినిధి: శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మార్నింగ్‌ స్టార్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ కక్కుర్తి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తుంది. శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బయల్దేరిన ప్రైవేట్ బస్సును డ్రైవర్‌ అంతర్రాష్ట్ర రవాణా పన్ను కట్టకుండా తప్పించుకునే క్రమంలో వేరే మార్గంలోకి మళ్లించినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ చేరాల్సిన ఆ బస్సును దారి మళ్లించి వేరేదారిలో తీసుకెళ్లాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్‌ చేరుకోవాల్సిన బస్సు ఇంకా కర్ణాటక సరిహద్దు కూడా దాటకపోవడంతో ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ప్రయణికులు వేరే మార్గంలో వెళ్తున్నట్టు గ్రహించి వెంటనే బస్సు డ్రైవర్‌ను నిలదీశారు.  దానితో టోల్‌ ట్యాక్స్‌ తప్పించుకునేందుకే బస్సును దారిమళ్లించినట్టు డ్రైవర్‌ తెలిపాడు. దీంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బూదగుంపలో కొద్దిసేపు గందరగోళం తర్వాత ఈ ఉదయం 10:00 గంటల సమయంలో బస్సు హైదరాబాద్‌కు బయల్దేరినట్టు తెలుస్తోంది. 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock