Thursday, 24 August 2017 | Login

మరోసారి కాల్పులకు పాల్పడిన పాక్ బలగాలు

వాస్తవం ప్రతినిధి: జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌ సెక్టార్‌ వద్ద పాకిస్థాన్‌ బలగాలు మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో ఘటనలో కుప్వారా జిల్లా కాలరూస్‌లోని అటవీప్రాంతంలో 41 ఆర్‌ఆర్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సైనికుడికి గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఉగ్రవాదులు అక్కడే దాగి ఉంటారన్న కోణంలో భద్రతా దళాలు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock