Thursday, 24 August 2017 | Login

బీజేపీలోకి ఉపేంద్ర

వాస్తవం ప్రతినిధి:  సంచలన కన్నట నటుడు ఉపేంద్ర త్వరలో బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పర్యటించే సందర్భంగా కన్నడ నటుడు ఉపేంద్ర బిజెపిలో చేరతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

బెంగళూరులో శనివారం సాయంత్రం ఉపేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడతారని, తన రాజకీయ ప్రవేశం గురించి వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల పట్ల ఉపేంద్రకు ఆసక్తి ఉన్నట్లు, కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఇటీవలికాలంలో కథనాలు వెలువడ్డాయి. తరుణంలో ఆయన బిజెపిలో చేరతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. సాయంత్రానికి ఉపేంద్ర రాజకీయ ఎంట్రీపై స్పష్టత వస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock