Thursday, 24 August 2017 | Login

వస్త్ర దుకాణం దగ్థం... నష్టం విలువ రూ.5కోట్లు


వాస్తవం ప్రతినిధి:  చిత్తూరులో శుక్రవారం అర్థరాత్రి అపూర్వ షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో కోట్ల మేరకు ఆస్తినష్టం సంభవించింది. చిన్నపాటిగా ప్రారంభమైన మంటలు..క్షణాల్లోనే ఎగసిపడ్డాయి.. ఒక్కసారిగా అలజడి.. అగ్ని కీలలకు భవనంలోని సరుకంతా బూడిదయింది.

యజమానికి విషయం తెలియదు.. ఆయన చేరుకునే సరికే అగ్నికి భవనమంతా ఆహుతయింది. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులు హుటాహుటిన తరలివెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock