Thursday, 24 August 2017 | Login

పెళ్లి హెలికాప్టర్ జైల్లో ల్యాండయింది


వాస్తవం ప్రతినిధి:  ఎక్కడికో బయల్దేరి...ఇంకెక్కడికో చేరినట్లయింది వీళ్లపని. పెళ్లికని హెలికాప్టర్లో బయల్దేరిన ఓ కుటుంబం ఖర్మగాలి జైల్లో దిగింది. ఉన్నఫళంగా హెలికాప్డర్ రావడంతో జైలు సిబ్బంది ఆందోళన చెంది వారిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు విషయం తెలుసుకున్నాక విడిచిపెట్టారు.

మలేషియాలో నివసిస్తున్న బంగ్లాదేశీ కుటుంబం కాశింపూర్‌లో జరిగే బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హెలికాప్టర్‌లో వచ్చారు. అయితే.. పైలట్‌ పొరపాటున కాశింపూర్‌ సెంట్రల్‌ జైలులో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశాడు. దాంతో పోలీసులు వెంటనే అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులను, పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. పొరపాటున జైలులో ల్యాండ్‌ అయినట్లు విచారణలో వెల్లడవడంతో వారిని కొద్దిసేపటి తర్వాత పంపించేశారు. ఈ విషయాన్ని జైలు ఐజీ జనరల్‌ సయీద్‌ ఇఫ్తేకర్‌ ఉద్దీన్‌ తెలియజేశారు. ‘జైలులో ఉన్న మిలిటెంట్లను తప్పించేందుకు ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. అందుకే హెలికాప్టర్‌ రాగానే వారిని అదుపులోకి తీసుకున్నాం. తర్వాత పైలట్‌ పొరపాటు పడటం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్నాం’ అని ఉద్దీన్‌ తెలిపారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock