Thursday, 24 August 2017 | Login

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన మెట్రో బస్సు

వాస్తవం ప్రతినిధి: వరంగల్ రూరల్ గీసుకొండ మండలం కొమ్మాల సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన మెట్రో బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు  ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడినట్లు తెలుస్తుంది.

అయితే కొందరు ప్రయాణికులు మాత్రం  స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన మెట్రో బస్సు నర్సంపేట డిపోకు చెందినదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock