Thursday, 24 August 2017 | Login

బీజేపీ పొత్తు పై ఎలాంటి ధోకా లేదు: మెహబూబా ముఫ్తీ

వాస్తవం ప్రతినిధి: బీజేపీతో పొత్తుపై ప్ర‌ధాని మోదీ నూరు శాతం హామీ ఇచ్చార‌ని జ‌మ్మూక‌శ్మీర్ సీఎం మెహ‌బూబా ముఫ్తీ తెలిపారు. ఈ రోజు ఢిల్లీ లో ప్రధాని మోదీ ని కలిసిన ఆమె అనంతరం మీడియా తో మాట్లాడుతూ...ప్రధాని పొత్తుపై భరోసా ఇచ్చారని ఆమె తెలిపారు.

 ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో బీజేపీ-పీడీపీ మ‌ధ్య పొత్తు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆర్టిక‌ల్ 35ఏపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు వ‌స్తున్న‌ట్లు వార్తలు వెలువడ్డాయి. 35 ఏ అంశాన్ని చ‌ర్చించేందుకు ఇటీవ‌ల కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కూడా ముఫ్తీ క‌లిశారు. ఒకవేళ 35ఏ ఆర్టిక‌ల్‌పై చ‌ర్చ గనుక చేప‌డితే దాని వ‌ల్ల జ‌మ్మూక‌శ్మీర్‌పై నెగ‌టివ్ ప్ర‌భావం ప‌డే అవకాశాలున్నాయ‌ని మెహబూబా తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌త్యేక హోదాకు ఏదైనా విఘాతం జ‌రిగితే అక్క‌డ జాతీయ జెండాను ప‌ట్టుకునేందుకు కూడా ఎవ‌రూ ఉండ‌ర‌ని ఇటీవ‌ల ముఫ్తీ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. జ‌మ్మూక‌శ్మీర్‌ను ఇండియాలో భాగ‌స్వామ్యం చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఆమె అన్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock