Thursday, 24 August 2017 | Login

బక్సర్ జిల్లా లో విషాదం....కలెక్టర్ ఆత్మహత్య!

వాస్తవం ప్రతినిధి: బీహార్ రాష్ర్టంలోని బక్సర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బక్సర్ జిల్లా కలెక్టర్ ముఖేశ్ పాండే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. ఒక భాద్యతా యుతమైన పదవి లో ఉన్న ముఖేశ్ రైలు కింద పడి మృతి చెందడం అందరినీ కలచివేసింది.

ఈ విషాద ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా నిల్చుని కలెక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పాండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. సూసైడ్ నోట్ లో .....నేను ముఖేశ్ పాండే. 2012 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. బీహార్ క్యాడర్ కు చెందిన నేను ప్రస్తుతం బక్సర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదు. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావు గురించి మా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండి. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లోని 742 గదిలో పూర్తి స్థాయి సూసైడ్ నోట్ లేఖ ఉందని కలెక్టర్ రాసి ఉంచారు. 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock