Thursday, 24 August 2017 | Login

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు


వాస్తవం ప్రతినిధి: ఇటీవల భారీ మెజార్టీ తో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. పది గంటలకు రాష్ట్రపతిభవన్ లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి తో ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా కేంద్రమంత్రులు, అన్ని పార్టీల రాజ్యసభ, లోక్‌సభాపక్ష నేతలు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్ వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం దీనదయాళ్ ఉపాధ్యాయ పార్కులో దీన్‌దయాళ్ విగ్రహానికి, అలానే పటేల్ చౌక్‌లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.     

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock