Thursday, 24 August 2017 | Login

రోడ్డు ప్రమాదం లో ఏఆర్ ఎస్సై మృతి

వాస్తవం ప్రతినిధి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక ఏఆర్‌ ఎస్సై మృతి చెందినట్లు తెలుస్తుంది. ఏఆర్‌ ఎస్సై దుర్గారావు తన విధులు ముగించుకున్న అనంతరం ఇంటికి వెళుతుండగా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద అతడి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో దుర్గారావు తీవ్రంగా గాయపడడం తో అతడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock