Thursday, 24 August 2017 | Login

చిత్తూరు లో టెక్స్ టైల్స్ షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: మొన్న తమిళనాడు లోని ప్రముఖ షో రూమ్ చెన్నై సిల్క్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని, భారీ ఆస్థి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిత్తూరులో టెక్స్ టైల్స్ లో భారీ అగ్నిప్రమాద చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. చిత్తూరు లోని అపూర్వ టెక్స్‌టైల్స్‌లో గురువారం అర్ధరాత్రి ఈ  భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అర్ధరాత్రి ఒంటిగంట నుంచి అపూర్వ టెక్స్ టైల్స్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనితో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తో ప్రాణ నష్టం జరగక పోవచ్చు కానీ భారీ గా ఆస్థి నష్టం జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock