Thursday, 24 August 2017 | Login

బ్యాంకులకు నాల్రోజులు సెలవ్...


వాస్తవం ప్రతినిధి: బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ఈరోజే చేసుకోండి.. డబ్బులు విత్ డ్రా చేయడం.. ఎవరికైనా పంపడం, చలాన్ కట్టడం వంటి పనులు ఈరోజు చేయకుంటే మరో నాల్రోజులు బ్యాంకువైపు వెళ్లనక్కరలేదు. ఎందుకంటే రేపటినుంచీ నాల్రోజులు సెలవులే సెలవులు.

 ఈనెల 12 రెండో శనివారం, 13 ఆదివారం, 14 శ్రీకృష్ణ జన్మాష్టమి, 15 స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆన్లైన్, డిజిటల్లావాదేవీలు యథావిధిగా సాగుతాయి. ఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. మరోవైపు ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25 వినాయక చవితి, 26 4 శనివారం, 27 ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock