Thursday, 24 August 2017 | Login

చిన్నమ్మ పై మరో బాంబు పేల్చిన రూప!

వాస్తవం ప్రతినిధి: బెంగుళూరు మాజీ జైళ్ళ శాఖ మాజీ డీఐజీ రూప తాజా గా చిన్నమ్మ పై మరో బాంబు పేల్చింది. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తరచూ ఒక ఎమ్మెల్యే నివాసానికి వెళుతుంది అని పెద్ద బాంబు పేల్చింది.

కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసులు జారీ

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.  గతంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కేసు విచారణలో భాగంగా జైట్లీ ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇవన్నీ కూడా కేజ్రీ ఆదేశిస్తే నే న్యాయవాది మాట్లాడారని జైట్లీ ఆరోపించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టాలు తప్పిన మరో రైలు.. 74 మందికి గాయాలు


వాస్తవం ప్రతినిధి: ఉత్తర్‌ప్రదేశ్‌లో కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. అరియా వద్ద కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈరోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 9 బోగీలు పట్టాలు తప్పాయి. 

కేంద్రమంత్రి కి లేఖ రాసిన టీఆర్ఎస్ ఎంపీ

వాస్తవం ప్రతినిధి: కేంద్రమంత్రి ఉమాభారతికి టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బుధవారం లేఖ రాసినట్లు తెలుస్తుంది. తెలంగాణ అవసరాల కోసం తక్షణమే 20 టీఎంసీల నీటిని విడుదల చేయాలని లేఖ ద్వారా మంత్రిని విజ్ఞప్తి చేశారు ఎంపీ బూర నర్సయ్య.

పేద ప్రజలకు వనిత కార్డులతో మేలు: ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్


వాస్తవం ప్రతినిధి:  పేద ప్రజలకు వనిత కార్డులతో మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని లంబాడీపేట సుగాలి కాలనీలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కాగిత కొండా ఆధ్వర్యంలో వనిత కార్డులను ప్రజలకు పంపిణీ చేసారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న నంద్యాల పోలింగ్

వాస్తవం ప్రతినిధి: నంద్యాల ఉప ఎన్నిక అనుకున్న దానికంటే చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా గంట గంటకు భారీగా పోలింగ్ నమోదు అవుతుండడం విశేషం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.1 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడం తో పోలింగ్ శాతం బాగానే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బెల్లందూర్ సరస్సు పై విచారణ జరిపిన ఎన్ జీ టీ

వాస్తవం ప్రతినిధి: విషపు నురగలు కక్కుతూ బెంగళూరు వాసులకు కొన్నేళ్లుగా బెల్లందూర్ సరస్సు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సరస్సు ఘటనపై జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఈ రోజు విచారణ జరిపింది.

సాధారణ వ్యక్తిగా గాంధీ ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్

వాస్తవం ప్రతినిధి: ఆయన తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ కానీ సాధారణ వ్యక్తిగా ఓపీ విభాగం లో కూర్చొని వైద్యుడిని కాలిసారు. ఆయనే గవర్నర్ నరసింహన్. గతంలో ఆయన కాలుకు గాయం అయిన కారణంగా పరీక్షల కోసం అని ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.

రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 149వ జయంతి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణా సి ఎం శ్రీ కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కుశంకుస్థాపన చేశారు.

More Articles ...

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock