Thursday, 24 August 2017 | Login

మాటలతో కాదు...చేతలతో సమాధానం చెప్పాలనుకుంటున్నభారత ఆర్మీ  

వాస్తవం ప్రతినిధి: ఇటీవల భారత్-చైనా ల మధ్య యుద్ద వాతావరణం ను తలపిస్తున్న డొక్లాం వివాదం. ఈ డొక్లాం సమస్యపై చైనా తరచూ ఘాటు వ్యాఖ్యలకు దిగడంతో పాటు వెనక్కు తగ్గకపోతే ఘోర ప్రభావాన్ని భారత్‌ చవి చూస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

చైనా వ్యాఖ్యలకు అడపా దడపా భారత్‌ తరఫు నుంచి మన నాయకులు దీటుగా జవాబిస్తున్నప్పటికీ చైనా తన దూకుడును మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ క్రమంలో కేవలం మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశ్యం తో భారత్ డొక్లాం లో భారీగా బలగాలను మోహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ భారిగా బలగాలను మోహరించాలని ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. ఇటీవల అక్కడి సమీప ప్రాంత గ్రామ ప్రజలను ఖాళీ చేయించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో తాజా గా బలగాలను మోహరించడం తో యుద్దానికి సన్నద్దమైనట్లు అనిపిస్తుంది. అయితే గ్రామాలలో ప్రజలను ఖాళీ చేయించిన వార్తలను భారత ఆర్మీ ఖండించింది. కానీ   
ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుదళానికి కూడా ఆపరేషనల్‌ అలర్ట్‌ జారీ అయినట్లు సమాచారం. శుక్రవారం భారత్‌-చైనాల మేజర్‌ జనరల్‌ స్ధాయి సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అలర్ట్‌లు జారీ కావడం గమనార్హం. అంటే చైనా తాను వెనక్కు తగ్గకుండా కేవలం నోటిమాటతో తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బెదిరింపులకు చైనా సరిహద్దులో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని భారత్‌ నమ్ముతోంది. అందుకే ఉన్న పళంగా 3,488 కిలోమీటర్ల సరిహద్దులోని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన అలర్ట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అత్యవసర పరిస్ధితుల్లో వాయుదళం సేవలను కూడా వినియోగించి ప్రత్యర్థికి ముచ్చెటమలు పట్టించాలని కూడా భావిస్తుందట.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock