Thursday, 24 August 2017 | Login

దేశ ప్రజలకు యూపి సీఎం ఆదిత్యనాథ్‌ క్షమాపణలు చెప్పాలి : ఆజాద్   


వాస్తవం ప్రతినిధి: గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఆక్సిజన్‌ సరఫరా అందక 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మరో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరోవైపు ఘటనపై యూ పీ ప్రభుత్వాన్ని విపక్షాలు దుయ్యబట్టాయి.

సీఎం ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.  యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చిన్నపిల్లల మరణాలు సంభవించాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.  ఘటనపై యూ పీ ముఖ్యమంత్రి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడం సహా ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆరోగ్య మంత్రులూ తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ విపక్షనేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.        

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock