Thursday, 24 August 2017 | Login

యూపీ ప్రభుత్వంపై  మండిపడ్డ సత్యార్థి   


వాస్తవం ప్రతినిధి:  యూపీ ప్రభుత్వంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత లోక్‌సభ నియోజకవర్గం గోరఖ్‌పూర్ కేంద్రంలోని ప్రభుత్వ బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కళాశాల దవాఖానలో గత రెండు రోజుల్లో 30 మంది బాలలు మృత్యువాత పడ్డ ప్రమాదంపై  కైలాశ్‌ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

.  ‘ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..?’ అని ప్రశ్నించారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జోక్యం చోసుకోవాలని కోరారు.‘సీఎం ఆదిత్యనాథ్‌ జీ.. ఈ ఘటనలో మీరు తీసుకునే నిర్ణయం దశాబ్దాలుగా అవినీతిమయమైన వైద్యవ్యవస్థను సరిచేయాలి. అప్పుడే ఇలాంటి ఘటన జరగకుండా ఉంటాయి’ అని సత్యార్థి ట్వీట్‌ చేశారు.   

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock