Thursday, 24 August 2017 | Login

అత్యవసర సమావేశం నిర్వహించిన యోగి  


వాస్తవం ప్రతినిధి:  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అత్యవసర  సమావేశాన్ని నిర్వహించారు..  రోగుల సమస్యలపై ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించి వెళ్లిన రెండు రోజుల్లోనే ఈ ఘోరం జరగడంతో యోగి సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. 

శనివారం ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత యూపీ ఆరోగ్యమంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్‌ ఇద్దరూ గోరఖ్‌పూర్ ఆస్పత్రికి  వెళ్ళిఘటన వివరాలు పరిశీలించారు. కాగా శనివారం ఉదయం ఆక్సిజన్ అందని కారణంగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందని కారణంగా పిల్లలకు ఎన్సిఫలిటిస్ సోకినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెదడుపై అత్యంత వేగంగా ప్రభావం చూపే ఈ వ్యాధి కారణంగానే ఒక్కరోజులో 30 మంది పిల్లలు బలయ్యారు.    

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock