Thursday, 24 August 2017 | Login

చిన్నారుల ఆయువు తీసేశారు

గోరఖ్ పూర్లో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారుల మృతి

వాస్తవం ప్రతినిధి:  ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ప్రభుత్వాస్పత్రిలో ఘోరం జరిగింది. రెండ్రోజుల వ్యవధిలో అక్కడ చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు ప్రాణాలు విడిచారు. బాబా రాఘవ్దాస్మెడికల్కాలేజీలో ఆగస్టు 9–10 తేదీల్లో మరణాలు నమోదయ్యాయి.

ఆక్సిజన్కొరత వల్ల 21 మంది చిన్నారులు మరణించారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.  ‘గోరఖ్పూర్ఎస్పీ ఏం చెప్పారంటే ద్రవరూప ఆక్సిజన్కొరతతో 21 మంది మరణించారు. ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారుఅని తెలిపారు. చిన్నారుల వార్డులో 17 మంది, మెదడువాపు వార్డులో ఐదుగురు, జనరల్వార్డులో 8 మంది మృతి చెందారని, కారణాలపై వైద్యుల్ని విచారిస్తున్నామని జిల్లా కలెక్టర్రాజీవ్రౌతలా చెప్పారు. పక్కనున్న సంత్కబీర్నగర్జిల్లా ఆస్పత్రి నుంచి ఆక్సిజన్తెప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యంతో ఆక్సిజన్సరఫరా నిలిపివేశారా? అని ప్రశ్నించగా.. ఆక్సిజన్సరఫరా కోసం సంబంధిత కంపెనీకి కొంత మొత్తం చెల్లించారని రౌతలా సమాధానమిచ్చారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock