Thursday, 24 August 2017 | Login

రాజీనామా కు సిద్దమైన రైల్వే మంత్రి!

వాస్తవం ప్రతినిధి: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రధాని నరేంద్ర మోదీ ని కలిశారు. వ‌రుసగా జరుగుతున్న రైలు ప్ర‌మాదాల‌తో క‌ల‌త చెందిన మంత్రి రాజీనామా చేస్తానంటూ ప్ర‌ధానిని క‌లిసినట్లు తెలుస్తుంది. అయితే మోదీ మాత్రం వేచి చూడాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తుంది. గ‌త శ‌నివారం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఉత్క‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో 23 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే.

ఆగస్టు నెలాఖరుకు చలామణి లోకి రానున్న రూ.200 నోటు

వాస్తవం ప్రతినిధి: అక్రమ నగదు చలామణి.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 200 నోట్లను ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త నోటు ను ఆగస్టు నెలాఖరుకు గానీ లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో చలామణి లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఒక్కో దేశంలో ఒక్కోలా తలాక్


వాస్తవం ప్రతినిధి:  తలాక్.. ముస్లిం మహిళల పాలిట యమపాశం.. భర్త వద్దనుకుంటే నిముషాల్లో వదిలించుకునేందుకు ఆ మతాచారం ప్రకారం లభించిన ఓ అద్భుత అవకాశం. ముడుసార్లు తలాక్ అని రాసి ఓ పేపరు అందజేస్తే చాలు భార్యాభర్తల మధ్యబంధం తెగిపోతుంది.

బ్లూ వేల్ గేమ్ పై ఫేస్ బుక్,గూగుల్,యాహు సంస్థలకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీ కోర్టు

వాస్తవం ప్రతినిధి: చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న ‘బ్లూ వేల్‌ ఛాలెంజ్‌’పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూ సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.

నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం


వాస్తవం ప్రతినిధి: భూమా నాగిరెడ్డి మరణం కారణంగా ఖాళీ ఏర్పడిని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నేడు ఉప ఎన్నిక జరుగుతుండగా పోలింగ్ ఉత్సాహంగా మొదలైంది. నంద్యాల పట్టణంతోబాటు పలు గ్రామాల్లో భారీగా ఓటర్లు పోలింగు బూతుల ముందు బారులుతీరారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock