Thursday, 24 August 2017 | Login

దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ద నౌక....చైనా అసంతృప్తి

వాస్తవం ప్రతినిధి: ఒకపక్క ఉ.కొరియా పై బెదిరింపుల పరంపర కొనసాగిస్తూనే మరోపక్క దక్షిణ చైనా సముద్రం విషయంలో కూడా అమెరికా పరోక్షంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది. దక్షిణ చైనా సముద్రం లోని కృత్రిమ దీవికి సమీపంలో అమెరికా యుద్ధ నౌక మొహరించినట్లు తెలుస్తుంది.

దీనితో అమెరికా చర్య పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పార్ట్లే దీవుల్లోని మిస్చీఫ్‌ రీఫ్‌కు ఆరు నాటికల్‌ మైళ్ళ దూరంలో అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ జాన్‌ మెక్‌కెయిన్‌ మోహరించడంతో దానికి ప్రతి గా చైనా నావికాదళం హెచ్చరిక జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్‌ షుయాంగ్‌ శుక్రవారం దీనిపై స్పందిస్తూ, ఇది చైనా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను దెబ్బతీయడమే కాగలదని పేర్కొన్నారు. ఈ సంఘటన పట్ల చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని,దీనిపై అమెరికాకు అధికారికంగా నిరసన తెలియచేయనున్నట్లు చెప్పారు. 'ఫ్రీడమ్‌ ఆఫ్‌ నావిగేషన్‌' పేరుతో గురువారం సాగిన ఈ ఆపరేషన్‌ ఆరు గంటల్లో ముగిసింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఆపరేషన్‌ చేపట్టడం ఇది మూడవసారి.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock