Thursday, 24 August 2017 | Login

లావోస్ కు అల్టిమేటమ్ జారీ చేసిన కంబోడియా ప్రధాని

వాస్తవం ప్రతినిధి: సరిహద్దును ఉల్లంఘించిన లావోస్‌ బలగాలను కంబోడియా ప్రధాని హెచ్చరించారు. ఆరు రోజుల్లోగా బలగాలను వెనక్కి ఉపసంహరించు కోవాల్సిందిగా లావోస్‌కు అల్టిమేటమ్‌ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆరు రోజుల్లో బలగాలను వెనక్కి మొహరించకపోతే  సైనికచర్యను ఎదుర్కొవాల్సి వుంటుందని గట్టిగా హెచ్చరించారు.

17వ తేదీకల్లా వైదొలగాలంటూ అల్టిమేటమ్‌ జారీ చేసిన కంబోడియా ప్రభుత్వం రాకెట్‌ లాంచర్లతో సైనిక బలగాలను సరిహద్దుల్లో మోహరించాలని సైనిక కమాండర్లను ఆదేశించింది. ''మనం మిత్రులమే కానీ స్నేహితుడు మా తల మీదకు ఎక్కకూడదు.'' అని హన్‌సెన్‌ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాన్ని వీడి వెళ్ళాలంటూ కంబోడియా ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత ఏప్రిల్‌లో ఉత్తర స్టంగ్‌ ట్రెంగ్‌ ప్రావిన్స్‌లోని కంబోడియా భూభాగంలోకి దాదాపు 30మంది లావోస్‌ సైనికులు ప్రవేశించారని కంబోడియా ప్రధాని హన్‌సెన్‌ తెలిపారు. ఈ విషయమై లావోస్‌ ప్రధానితో మాట్లాడానని చెప్పారు. ఎలాంటి షరతులు విధించకుండా కంబోడియా భూభాగం నుండి సైనిక బలగాలను ఉపసంహరించాలంటూ లావోస్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock