Thursday, 24 August 2017 | Login

షరీఫ్ స్థానంలో పోటీచేయనున్న ఆయన సతీమణి

వాస్తవం ప్రతినిధి: పాకిస్ధాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ స‌తీమ‌ణి పాక్ పార్ల‌మెంటు సీటుకు పోటీ చేయ‌నున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పనామా పత్రాల కేసు కు సంబంధించి నవాజ్ షరీఫ్ ప్రధానిగా అనర్హులు అని పాకిస్ధాన్ సుప్రీంకోర్టు తీర్పుతో ష‌రీఫ్ ఆ ప‌ద‌వి కోల్పోయిన విష‌యం విధిత‌మే.

ఈనేప‌ధ్యంలో ఆయన స్ధానంలో ఆయన స‌తీమ‌ణి కుల్సూమ్ న‌వాజ్ ష‌రీఫ్ పోటీ చేయ‌నున్నారు.  ఉప ఎన్నిక 45 రోజుల్లో జ‌ర‌గాల్సి ఉంద‌ని, పాకిస్ధాన్ ముస్లీం లీగ్‌- న‌వాజ్ పార్టీ అభ్య‌ర్ధిగా కుల్సూమ్ పోటీ చేస్తార‌ని ష‌రీఫ్ స‌ల‌హాదారు ఆసిఫ్ కిర్మాణి తెలిపారు. ఈ నేపధ్యంలో కుల్సూం న‌వాజ్ ష‌రీఫ్ పేర నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశామ‌ని కిర్మాణి అన్నారు.

   

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock