Monday, 21 August 2017 | Login

ఉ.కొరియా పై బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తున్న ట్రంప్

వాస్తవం ప్రతినిధి: గత 36గంటలుగా ఉత్తర కొరియాపై బెదిరింపుల పర్వాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కొనసాగిస్తున్నారు. ఉత్తరకొరియాపై అన్ని రకాలుగా దాడికి దిగుతామని చేసిన హెచ్చరిక సరిపోదని భావిస్తున్నట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

న్యూజెర్సీలోని బెడ్‌ మినిస్టర్‌లో గోల్ఫ్‌ క్లబ్‌లో జాతీయ భద్రతా వ్యవహారాలపై సమావేశానికి ముందుగా ట్రంప్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా తాను తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటే మంచిది. లేకపోతే సమస్యల్లో పడతారని మరోసారి  హెచ్చరించారు. గతంలో ప్రపంచ దేశాలు ఎన్నడూ చూడని రీతిలో ఉత్తర కొరియాపై తాము దాడికి దిగుతామని ఈవారం ప్రారంభంలో ట్రంప్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు వెల్లువెత్తాయి. ఈ ఖండనల నేపథ్యంలో తన స్వరాన్ని తగ్గించుకోవడానికి బదులుగా గురువారం మరింత పెంచారు. ''బహుశా, ఉత్తర కొరియాకు ఇప్పుడిచ్చిన ఈ హెచ్చరి కలు సరిపోవనుకుంటా. అమెరికాను లక్ష్యంగా చేసుకుని అనేక సంవత్సరాల నుండి వారు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ దేశ ప్రజల కోసం, ఇతర దేశాల కోసం వీరిని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ముందుగా దాడి చేసే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోందా అని ప్రశ్నించగా, దాని గురించి మాట్లాడటం లేదని, అలా ఎన్నడూ చేయబోమని స్పష్టం చేశారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock