Thursday, 24 August 2017 | Login

నార్త్ వెస్ట్ పాక్ లో బాంబు పేలుడు....ఇద్దరు మృతి!

వాస్తవం ప్రతినిధి: నార్త్‌వెస్ట్ పాకిస్థాన్‌లోని గిరిజన ఆవాస ప్రాంతంలో ఐఈడీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 26 మంది గాయాలపాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

దీనితో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. నవాగై తహసీల్ పరిధిలోని చాహర్‌మంగ్ ప్రాంతంలో దుండగులు కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడుకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆర్మీ అధికారుల బృందం చేరుకుని అనుమానాస్పద ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock