Thursday, 24 August 2017 | Login

భారత పర్యటనకు ఇవాంకా

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా నవంబర్లో హైదరాబాదులో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్నారు. ఇవాంకా ప్రస్తుతం తన తండ్రికి సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్త ఔత్సాహిక వ్యాపారవేత్తలతో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సుకు తన కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హాజరు కానున్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ధారించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా, జీఈఎ్‌స-2017కు అమెరికా ప్రతినిధుల బృందానికి ఇవాంకా ట్రంప్‌ సారథ్యం వహిస్తుందిఅని ట్రంప్‌ గురువారం రాత్రి ట్వీట్‌ చేశారు. ఈ సదస్సు నవంబరు 28 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. నీతి ఆయోగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సులో ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, ‘భారత్‌లో  నేపథ్యంలో, ‘భారత్‌లో జరిగే జీఈఎ్‌స-2017కు అమెరికా ప్రతినిధుల బృందానికి సారథ్యం వహించనుండడం, ప్రధాని మోదీని, ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలను కలుసుకోనుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానుఅని ఇవాంకా ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీతో తాను కరచాలనం చేస్తున్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock