Thursday, 24 August 2017 | Login

దావూద్ కి సంబంధించి ఆశక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్ ప్రభుత్వం!

వాస్తవం ప్రతినిధి:  భారత్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’గా ఉన్న మాఫియా డాన్ నాయకుడు దావూద్‌ ఇబ్రహీం కి సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం పలు ఆశక్తి కర విషయాలు వెల్లడించింది. పాకిస్థాన్‌లో దావూద్ దాదాపు21 మారుపేర్లతో చలామణీ అవుతున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది.

అమెరికా,ద.కొరియా సంయుక్త విన్యాసాలను నిలుపుచేయాలన్న చైనా!

వాస్తవం ప్రతినిధి: అమెరికా,దక్షిణ కొరియా దేశాలు కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక విన్యాసాలను నిలిపివేయాలని చైనా కోరినట్లు తెలుస్తుంది. ఇరు దేశాలు వార్షిక విన్యాసాలు ప్రారంభించిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్‌ స్పందిస్తూ..

ఇటలీ లో భూకంపం....ఒకరు మృతి!

వాస్తవం ప్రతినిధి: ఇటలీలోని ఇచియా అగ్నిపర్వత ప్రాంతానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో సోమవారం భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. నాప్లెస్‌ నగరానికి సమీపంలో, ఇటలీ తీర ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో రాత్రి 9గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు స్థానిక మీడియా వార్తలు తెలిపాయి.

బంగ్లా మాజీ ప్రధాని అభ్యర్ధనను తిరస్కరించిన బంగ్లా కోర్టు

వాస్తవం ప్రతినిధి: బంగ్లా మాజీ ప్రధాన మంత్రి ఖలేదా జియా పై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తనపై నమోదైన అవినీతి కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ కోర్టును అభ్యర్ధించగా, ఆమె అధ్యర్దనను బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించినట్లు తెలుస్తుంది.

ఆఫ్ఘన్ లో సైన్యాన్ని మరి కొంత కాలం కొనసాగించనున్నాం: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనిక జోక్యాన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో అనుసరించే కొత్త విధానాన్ని ప్రకటించిన ఆయన ఆఫ్ఘన్‌లో తాలిబన్ల దౌర్జన్యాలకు చరమగీతం పాడుతామన్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock