Thursday, 24 August 2017 | Login

నేనే రాజు నేనే మంత్రి’ -రివ్యూ

దర్శకత్వం : తేజ

నిర్మాత : సురేష్ బాబు

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : రానా, కాజల్, క్యాతరిన్ థ్రెస

 వాస్తవం సినిమా: బాహుబలితో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన నటుడు రానా చేసిన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి’. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజివంటి విభిన్న కధలతో ప్రేక్షకులను అలరిస్తున్న రానా మిగతా హీరోలకంటే తాను భిన్నమని నిరూపిస్తూ మరీ ఈ సినిమా చేశాడు. ఇప్పుడు ఆ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం

కథ :

ఒక ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ(కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు.

అలా స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా, అందరికన్నా ఎత్తుకు ఎదిగే క్రమంలో తనకు తెలియకుండానే పూర్తిగా మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూ ముందుకెళుతుంటాడు. అయితే ఈ క్రమంలో శత్రువులు అతన్ని అణగదొక్కడానికి అన్ని దారుల నుండి చుట్టుముడతారు. దానితో రాజకీయ చదరంగంలో చిక్కుకున్న రాధ జోగేంద్ర ఎలాంటి కష్టాల్ని పడ్డాడు, ఎవరెవర్ని కోల్పోయాడు, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, చివరికి అతని జీవితం లో ఎలాంటి పరిస్థితులను ఎదురుకొని బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కధాంశం.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్ అంటే ఆయన పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేకాకుండా దర్శకుడు తేజ ఈసారి కథను ఆధారంగా చేసుకుని పనిచేయడం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, ఆమెను అంటుకుని నడిచే జోగేంద్ర పాత్ర అద్భుతంగా పండడం తో పాటు రానా, కాజల్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి మరీ నటించారు. వీరి మధ్య నడిచే భార్య భర్తల ట్రాక్ ను తేర మీద చాలా అందంగా ఆవిష్కరించారు తేజ.  అలానే సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశమైతే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది. అలానే సెకండాఫ్ లో జోగేంద్ర పాత్ర కళ్ళ ముందే అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారిపోవడం మరింత ఆకట్టుకుంది. సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా క్లైమాక్స్ కు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. ఇక సినిమా చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే అనిపించింది. సినిమా ముగింపు కూడా లవ్ ట్రాక్ తో ముడిపడి ఉండి, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకి వెయిట్ ను పెంచింది. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, పాటలు చాలా బాగున్నాయి. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని తీసుకొచ్చి, కథ మన మధ్యలోనే జరుగుతుందేమో అనిపించే అనుభూతి కలిగించింది అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా సెకండాఫ్ చివర్లో హీరో 200 మంది ఎమ్మెల్యేలను చంపడం, అందుకుగాను పడిన ఉరి శిక్ష తప్పే సన్నివేశాలు బలహీనంగా, లాజిక్స్ కు దూరంగా అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్లో జనాల ఇన్వాల్మెంట్ కూడా ఓవర్ గా ఉండి మొహమాటపెడుతుంది. ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ అంకంలో వచ్చే అసెంబ్లీ సన్నివేశం పెద్దగా ఉద్వేగం, మాటలు లేకుండానే ముగిసిపోతుంది. అందులో రానా చేత ఇంకాస్త బలమైన పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉండేది. అలాగే ముందు నుండి కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు కూడా సరైన జస్టిఫికేషన్ కనబడదు. ఒక దర్శకుడిగా, రచయితగా తేజ చాలా వరకు విజయం సాధించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే మంచి ప్రేమ కథను రాసుకున్న ఆయన అందుకు కావాల్సిన పాత్రల్ని కూడా అంతే బలంగా రాసుకుని, వాటికి తగిన నటీ నటుల్ని ఎంచుకుని, వారి నుండి మంచి నటనను రాబట్టుకున్నారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాలో సహజత్వాన్ని నింపింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిల నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

 మొత్తంగా..

నేనే రాజు నేనే మంత్రిచిత్రం పాత తేజాను చూపించి నటుడిగా రానాకు మంచి మార్కులు వేయిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కు ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం, కొన్ని లాజిక్స్ ను మిస్సవడం మినహా మంచి కథ, ఆకట్టుకునే నరేషన్, బలమైన పాత్రలు, రాధా జోగేంద్రల లవ్ ట్రాక్, అద్భుతమైన రానా, కాజల్ ల నటన అన్నీ కలిసి చిత్రం ప్రేక్షకుడ్ని మెప్పించే విధంగా తయారుచేశాయి. మొత్తం మీద పొలిటీషియన్ గా మారిన ప్రేమికుడి కథ ప్రేమ కథల్ని, డ్రామాతో నడిచే సినిమాల్ని ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.

.  ...పాంచజన్య

 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock