Thursday, 24 August 2017 | Login

 'ఫిదా’  రివ్యూ  


 రేటింగ్- 3/5  
నటీనటులు: వరుణ్ తేజ్ - సాయి పల్లవి - సాయిచంద్ - రాజా - సత్యం రాజేష్ - హర్షవర్ధన్ రాణె - గీతా భాస్కర్  - మనీషా తదితరులు
సంగీతం: శక్తి కాంత్
ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్
నిర్మాత: దిల్ రాజు
రచన - దర్శకత్వం: శేఖర్ కమ్ముల

  కథ :
అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది.

కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెల్లినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెల్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
 సినిమా ప్రథమార్ధంలో కథంటూ ఏమీ లేకపోయినా.. సన్నివేశాల్లోని తాజాదనం.. వినోదం.. బ్యూటిఫుల్ మూమెంట్స్ సమయం తెలియనట్లుగా చేస్తే.. ద్వితీయార్ధం మాత్రం నెమ్మదిగా.. సాగతీతగా అనిపిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య దూరం పెరగడానికి ఇందులో చూపించిన కారణాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఏదో విడిపోవాలి కాబట్టి విడిపోవాలి... క్లైమాక్స్ వచ్చాకే కలవాలి అన్నట్లుగా ఫోర్స్డ్ గా కథను నడిపించిన భావన కలిగిస్తుంది.   ద్వితీయార్ధంలోనూ కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రథమార్ధంలో మాదిరి వినోదం లేకపోవడం.. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో ‘ఫిదా’ మీద అంతకుముందున్న ఇంప్రెషన్ కొంచెం తగ్గుతుంది. ఐతే ద్వితీయార్ధం నిరాశ పరిచినప్పటికీ.. మరీ భారంగా అయితే అనిపించదు. కొన్ని ప్రతికూతలున్నప్పటికీ ‘ఫిదా’ ప్రత్యేకమైన సినిమానే. ఇందులోని ఎంటర్టైన్మెంట్.. ఫ్యామిలీ ఎమోషన్లు అన్ని వర్గాల ప్రేక్షకులకూ బాగానే కనెక్టయ్యే అవకాశముంది.  
 మొత్తంగా ..

కొందరు దర్శకులతో ఏ సాంకేతిక నిపుణుడు పనిచేసినా.. ఆ దర్శకుడి టేస్టు.. ఆ ముద్ర అలాగే కనిపిస్తాయి. ఆనంద్, హ్యాపిడేస్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ,సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఫిదా.. వరుణ్ కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురావటంతో పాటు, దర్శకుడు శేఖర్ కమ్ములను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందనే చెప్పాలి.   చివరగా: ఈ ప్రేమకథ.. ‘ఫిదా’ చేస్తుంది
 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock