Thursday, 24 August 2017 | Login

'నిన్నుకోరి'- రివ్యూ

రేటింగ్: 2.5/5 

కథ:

వైజాగ్లో పి.హెచ్.డి చేసే యువకుడు ఉమా మహేశ్వరరావ్ (నాని), పల్లవి (నివేతా థామస్) ను ప్రేమిస్తాడు. ఇంతలోనే పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. దీంతో పల్లవి, ఉమాతో వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ ఉమా మాత్రం లైఫ్లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కెరీర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత పరిణామాల వల్ల పల్లవి ఆది పినిశెట్టితో పెండ్లి జరగడం లండన్‌ వెల్లడం జరిగిపోతుంది. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నానికి విషయం తెలిసి.. దేవదాసులా మారతాడు. విషయం గ్రహించిన నాని గురువు భరణి.. నానికి లండన్‌లో ఓ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ విషయాన్ని పల్లవికి చెబుతాడు. ఆ తర్వాత ఆమె నానిని కలుస్తుంది. ఆమె మొహం చూసి సుఖంగా లేదనీ.. తనతో వచ్చేయమని నాని బలవంతం చేస్తాడు. నేను సుఖంగా వున్నాననీ.. కావాలంటే 10 రోజులు మా ఇంట్లో వుండి పరిశీలించమని ఆఫర్‌ ఇస్తుంది. ఇందుకు పల్లవి భర్త ఆది కూడా అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది మిగిలిన కథ.

పాసిటివ్స్:
తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదల కుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. గోపిసుందర్ సంగీతం ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే చేసింది.
నెగెటివ్స్ :

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మరిచి పాశ్చాత్య కల్చర్‌ ఎలా కొనసాగుతుందో చూపించాడు. ఇదంతా అక్కడి వారికి బాగానే వుంటుంది. కానీ మన తెలుగువారికి ఇదంతా చికాకు అనిపిస్తుంది. బలవంతంగా తెలుగుదనాన్ని కలుషితం చేసే కథ ఇది. ఇప్పటికే పాశ్చాత్య కల్చర్‌ మనవారిని పాడుచేస్తుంది. సినిమా పరంగా మరో ముందడుగు వేసిందనడంలో సందేహమే లేదు.సినిమా అంతా ఎంతో జాగ్రత్తగా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది.

 ...పాంచజన్య  

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock