Thursday, 24 August 2017 | Login

‘రారండోయ్ వేడుక చూద్దాం’- రివ్యూ 

రేటింగ్:2.75/5   
 
కథ :
అందరి కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆది (సంపత్) కి పంచ ప్రాణాలు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా మహారాణిలా ఉండే భ్రమరాంభను తన కజిన్ పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు శివ (నాగ చైతన్య).
ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్ కు చదువుకోడానికి వచ్చి శివకు దగ్గరవుతుంది. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు, శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి ? ఈ పగల మధ్య శివ, భ్రమరాంభల ప్రేమ ఏమైంది ? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు ? అనేదే ఈ సినిమా కథ.
 
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న, మంచి ట్విస్టును ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
 
మైనస్ పాయింట్స్ :
సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది.
 
తీర్పు:
కళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేదిగానే ఉన్నా భారీ స్థాయి అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానుల్ని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. రకుల్ ప్రీత్ పాత్ర చిత్రీకరణ, హీరో హీరోయిన్ల ఎమోషనల్ లవ్ ట్రాక్, కొన్ని పాటలు, డైలాగులు, కాస్త సెకండాఫ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా నిదానంగా సాగే మొదటి అర్ధ భాగం, పెద్దగా కొత్తదనమేమీ కనిపించని రొటీన్ కథా కథనాలు ఇందులో నిరుత్సాహపరిచే అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా సరదాగా కుటుంబంతో కలిసి చూసే వాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది.
                                           ....పాంచజన్య
 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock