Thursday, 24 August 2017 | Login

`బాబు బాగా బిజీ` రివ్యూ

రేటింగ్ : 2.0/5

మాధవ్ (శ్రీనివాస్ అవసరాల) అనే కుర్రాడు యుక్త వయసు ఆరంభం నుండే ఆడవాళ్ళ పట్ల, అమ్మాయిల పట్ల, శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ చాలా ఇన్నోసెంట్ గా ప్రవర్తిస్తూ స్కూల్ స్టేజ్ నుండే ప్లే బాయ్ లా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ అనేక మంది ఆడవాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాడు.

అలా అతను రిలేషన్ కలిగి ఉన్న ఒక మహిళ మూలంగా ఎదురైన ఇబ్బంది వలన, పెళ్లి వయసు మీద పడటం వలన ఇక ఇవన్నీ ఆపేసి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొస్తాడు మాధవ్. అలా పెళ్లి చూపుల ద్వారా రాధ (మిస్తి చక్రబర్తి) ని కలిసి, తన గతం గురించి ఆమె దగ్గర దాచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెడు తిరుగుళ్ళు మానేయాలని ప్రయత్నిస్తుంటాడు. అలా జీవితంలో కీలకమైన డెసిషన్ తీసుకున్న మాధవ్ అనుకున్నట్టే చెడు తిరుగుళ్ళు మానేసి మంచివాడిగా మారాడా ? అతని జీవితంలోని ఆడవాళ్లు అతనికెలాంటి పాఠం నేర్పారు ? చివరికి అతని జీవితం ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.సినిమా ఆరంభంలో వచ్చే హీరో యొక్క చిన్ననాటి జీవితంలో జరిగే కొన్ని సంఘటనల తాలూకు సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ ఎపిసోడ్లో ఇన్స్పెక్టర్ గా పోసాని కృష్ణ మురళి చేసిన కాస్తంత కామెడీ నవ్వించింది. హీరో మారుదామనుకుని, హీరోయిన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నించే కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. రియలిస్టిక్ లొకేషన్లలో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపారు.

నెగెటివ్

బాహుబలి వచ్చిన వారానికి రావడమే ఈ సినిమాకి అత్యంత పెద్ద నెగెటివ్ అని చెప్పచ్చు. జనం అంత బాహుబలి గోలలో కలక్షన్ ల హడావిడి లో ఉండగా ఒక అడల్ట్ కామెడీ ఈ టైం లో వస్తే అందరూ కేర్ చెయ్యకపోవచ్చు. అడల్ట్ కంటెంట్ చాలా ఓవర్ గా ఉండడం తో ఫామిలీ లు పొరపాటున కూడా ఈ సినిమాని చూసే ఛాన్స్ లేదు. పరవాలేదు అనిపించే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ చాలా డల్ చేసి పడేసాడు డైరెక్టర్.హంటర్ ని యాజ్ ఇటీజ్ గా దింపినా బాగుండేది కానీ అలా కాకుండా సొంతగా ట్రై చేసాడు డైరెక్టర్ నవీన్ . కామెడీ చాలా చోట్ల తేలిపోగా సెంటిమెంట్ సీన్ లు బెస్ట్ అనిపించేలా లేవు. అప్పటి వరకూ చెయ్యాల్సిన వెధవ పనులు అన్నీ చేసేసిన హీరో లాస్ట్ లో మేసేజీ ఇస్తూ ఉంటె వినడానికి చిరాకుగా ఉంటుంది.

మొత్తంమీద

తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రస్తుతం భిన్నమైన కథలను ఆదరిస్తున్న తరుణంలో అడల్ట్ కామెడీ కంటెంట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనిపించలేదు. ఆకట్టుకున్న శ్రీనివాస్ అవసరాల నటన, ఫస్టాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పోసాని కామెడీ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా కన్ఫ్యూజన్ కు గురిచేసిన కథలోని సబ్ ప్లాట్స్, ట్రైలర్స్ చూసి ఆశించిన ఎంటర్టైన్మెంట్ దొరక్కపోవడం, ఎమోషనల్ గా ప్రేక్షకుడిని తాకలేకపోయిన క్లైమాక్స్, దర్శకత్వ లోపం ప్రధాన బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే థియేటర్లోని సినిమా కన్నా ముందొచ్చిన ట్రైలర్లే బెటర్ గా అనిపించాయి.

                                                                                                                                                                  ... పాంచజన్య 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock