Thursday, 24 August 2017 | Login

చిలిపి కోర్కెను చెప్పిన బాలీవుడ్‌ బ్యూటీ


వాస్తవం సినిమా:   బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు కి ఓ చిలిపి కోర్కె ఉందట. వీలైతే ప్రతి ఏడూ వివాహం చేసుకొంటూనే ఉండాలని ఉందట.అయితే వేరెవరినో కాదండోయ్..తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌నే. తన భర్తతో తనకున్న అనుబంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలంటే ఏటా వివాహం చేసుకుంటూనే ఉండాలని అంటోంది బిపాసా.

వీరిద్దరూ ‘ఎలోన్‌’ చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడి 2016లో వివాహ బంధంతో ఒకటయ్యారు.   ముంబయిలో గురువారం జరిగిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా బిపాసా తన వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను పంచుకుంది. తన పెళ్లి వేడుక చాలా హడావుడిగా జరిగిపోయిందని గ్రాండ్‌గా కన్పించడానికి దగ్గరుండి చూసుకుంటూ చాలా కష్టపడ్డానని చెప్పింది.      

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock