Thursday, 24 August 2017 | Login

సాయిపల్లవి అందుకు నో చెప్పిందట !


వాస్తవం సినిమా:‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ను ఫిదా చేసి వారి హృదయాలను  దోచేసిన మలయాళ నటి సాయిపల్లవి. తొలి సినిమాతోనే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించేసింది.  ఈ భామ సహజత్వానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేకప్‌ లేకుండానే పలు సినిమాల్లో నటించారు కూడా.

  ఓ క్లాత్ షోరూం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నిర్వాహకులు సాయిపల్లవిని కోరారట. ఇందుకోసం నిర్వాహకులు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారట. అయితే ఇలాంటి కార్యక్రమాలకు రావడం తనకిష్టముండదని సాయిపల్లవి సున్నితంగా నో చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు టైం దొరికితే ఆస్పత్రుల ప్రారంభోత్సవాలు, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు ఉచితంగా వస్తానని చెప్పిందట సాయిపల్లవి.    

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock