Thursday, 24 August 2017 | Login

‘రాజా ది గ్రేట్‌’  న్యూ లుక్   


వాస్తవం సినిమా:  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాణంలో కథానాయకుడు రవితేజ నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’.  ఈ చిత్రేంలో రవితేజ సరసన మెహరీన్‌ కథానాయిక గా నటిస్తోంది. ఇందులో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు శనివారం ప్రకటించారు. మాస్‌ మహారాజా రవితేజను మునుపెన్నడూ లేనివిధంగా  చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.  మరోపక్క రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నారు. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. విక్రమ్‌ సిరికొండ దర్శకుడు.    

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock