Thursday, 24 August 2017 | Login

 ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే..


వాస్తవం సినిమా: నేడు "నేనే రాజు నేనే మంత్రి" మరియు బెల్లంకొండ శ్రీనివాస్ "జయ జానకి నాయక"  నితిన్' లై విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్నఏమిటేంటే.. ఈ ముగ్గురిలో ఎవరు యూఎస్ లో అత్యధిక డాలర్లని కొల్లగొడతారు అనేది.

ఓ సారి యుఎస్ మార్కెట్ రేంజ్ ని గమనిస్తే నితిన్ "అఆ" సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. త్రివిక్రమ్ సినిమాలకి మంచి మార్కెట్ ఉండడంతో ఏకంగా 2.49 మిలియన్ డాలర్లను సాధించి అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగవ చిత్రంగా రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో బాహుబలి మొదటి భాగం -రెండవ భాగం ఉండగా..మూడవ స్థానంలో మహేష్ శ్రీమంతుడు చిత్రం ఉంది.
అయితే ఇప్పుడు విడుదలకాబోయే "లై" సినిమాను కూడా అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాతో నితిన్ మరో భారీ హిట్ అందుకుంటాడో లేదో అనేది కాస్త సందేహంగానే ఉంది. ఇప్పటివరకు చిత్రం ట్రైలర్ బావుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని కారణంగా క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది.  అయితే ఈ మూడీంటిలో ఏ చిత్రం భారీ విజయాన్ని అందుకొంటుందో వేచి చూడాల్సిందే.         
 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock