Monday, 26 June 2017 | Login

అంతర్జాతీయ క్రికెట్ కు వీరేంద్ర నెహ్వాగ్ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్ కు వీరేంద్ర నెహ్వాగ్ గుడ్ బై

వాస్తవం ప్రతినిధి:   భారత క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు తన 37వ జన్మదినం

రోజున సెహ్వాగ్‌ ప్రకటించాడు.తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సెహ్వాగ్‌ టెస్ట్‌ కెరీర్‌లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్‌ తరపున ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌పై సిక్స్‌ కొట్టి ట్రిపుల్‌ సెంచరీ సాధించిన క్షణాలు క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. వన్డేల్లోనూ సచిన్‌ తర్వాత డబుల్‌ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా సెహ్వాగ్‌ నిలిచాడు. దూకుడే మంత్రంగా భావించే సెహ్వాగ్‌ తన ప్రతిభతో భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు సాధించిపెట్టాడు.* 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు* 251 వన్డేల్లో 35.05 సగటుతో 8,273 పరుగులు* 19 టీ20 మ్యాచ్‌ల్లో 21.88 సగటుతో 394 పరుగులు* టెస్టుల్లో 23 శతకాలు, 32 అర్థ శతకాలు* వన్డేల్లో 15 శతకాలు, 38 అర్ధ శతకాలు* టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు* టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు, వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు.

 

Read 118051 times Last modified on Monday, 02 November 2015 00:31
Rate this item
(1 Vote)

About Author

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock