Thursday, 24 August 2017 | Login

కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్దిగా యడ్యూరప్ప 


వాస్తవం ప్రతినిధి: కర్ణాటకలో  మూడురోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు బెంగుళూరు చేరుకొన్న అమిత్‌షా కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ...  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్దిగా  పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్పను నియమిస్తున్నట్లు అమిత్‌షా ప్రకటించారు.

యడ్యూరప్ప నాయకత్వంలో ప్రతి నియోజక వర్గంలో కమలం వికసించాలన్నారు.  రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభివృద్దికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని చెప్పారు. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్‌షా   సమావేశం కానున్నారు.    

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock