ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా పాజిటివ్ 

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గతఐదు రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ సూచించారు.
కాగా, సతీష్ మొన్న మండలి సమావేశానికి హాజరయ్యారు. అసంబ్లీ సెషన్స్‌లో భాగంగా శనివారం మండలిలో సతీష్ మాట్లాడారు. సతీష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. ఆయ‌న‌తో కాంటాక్ట్ లో ఉన్న వారంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు..  స‌భ్యులంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.