సోష‌ల్ మీడియా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్న ట్రంప్

    వాస్తవం ప్రతినిధి: అమెరికా   మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నార‌ని జ‌రుగుతోన్న‌ ప్ర‌చారం ఆస‌క్తిని రేపుతోంది.
     ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్ప‌డిన అనంత‌రం ట్రంప్ ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర ఖాతాల‌న్నింటినీ ఆయా సంస్థ‌లు బ్లాక్ చేసిన విష‌యం తెలిసిందే.  దీంతో ఆయా ఖాతాల‌ను వినియోగించుకోలేక‌పోతోన్న ట్రంప్ కొత్తగా తానే సోష‌ల్ మీడియా సంస్థ‌ను నెలకొల్పి, అందులో ఓ ఖాతాను ప్రారంభించాల‌ని భావిస్తున్నారు.
    మూడు నెల‌ల త‌ర్వాత ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా రీ ఎంట్రీ ఇస్తార‌ని ఆయ‌న‌ సీనియర్‌ సలహాదారు జేస‌న్ మిల్ల‌ర్ చెప్పారు. ట్రంప్ ప్రారంభించనున్న ఈ సోష‌ల్ మీడియా గ్రూపు చాలా భిన్నంగా ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. అది సోష‌ల్ మీడియా చ‌రిత్ర‌నే మార్చేస్తుందని చెప్పుకొచ్చారు.