బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి

వాస్తవం ప్రతినిధి: తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఉంటే చాలు.. ఆ సినిమా తప్పకుండా చూడాల్సిందే అనేంత ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో నిండిపోయింది. తను ఎంచుకున్న క్యారెక్టర్స్‌లో విలక్షణ నటనను ప్రదర్శిస్తున్న సేతుపతి.. ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తెలుగులో ఆయన విలన్‌గా నటించిన ‘ఉప్పెన’తో పాటు ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ సేతుపతి.. తన ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.